Type Here to Get Search Results !

Melulu Nee Melulu || మేలులు నీ మేలులు

 

Melulu Nee Melulu || మేలులు నీ మేలులు - Philip, Prabhakar, Akesk Lyrics


Melulu Nee Melulu || మేలులు నీ మేలులు
Singer Philip, Prabhakar, Akesk
Composer
Music Philip Jacob
Song Writer

Lyrics


మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా (2)

నా ప్రాణమున్నంత వరకు

విడచిపోలేనయ్యా ||మేలులు||



కొండలలో ఉన్ననూ (నీవు) మరచిపోలేదయ్యా

శ్రమలలో ఉన్ననూ (నీవు) విడచిపోలేదయ్యా (2)

నీది గొర్రెపిల్ల మనస్సయ్యా

యేసయ్యా.. గొర్రెపిల్ల మనస్సయ్యా – (3)



అగ్నిలో ఉన్ననూ (నేను) కాలిపోలేదయ్యా

జలములలో వెళ్లినా (నేను) మునిగిపోలేదయ్యా (2)

నీది పావురము మనస్సయ్యా

యేసయ్యా.. పావురము మనస్సయ్యా – (3)



చీకటిలో ఉన్ననూ (నన్ను) మరచిపోలేదయ్యా

దుఃఖములో ఉన్ననూ (మంచి) స్నేహితుడయ్యావయ్యా (2)

నీది ప్రేమించే మనస్సయ్యా

యేసయ్యా.. ప్రేమించే మనస్సయ్యా – (3)




Melulu Nee Melulu || మేలులు నీ మేలులు Watch Video



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.