Type Here to Get Search Results !

YEVARU CHOOPINCHALENI - ఎవరు చూపించలేనీ

 

YEVARU CHOOPINCHALENI - ఎవరు చూపించలేనీ - Sireesha B Lyrics


YEVARU CHOOPINCHALENI - ఎవరు చూపించలేనీ
Singer Sireesha B
Composer
Music Pranam Kamlakhar
Song WriterJoshua Shaik

Lyrics

ఎవరు చూపించలేనీ - ఇలలో నను వీడిపోనీ 

ఎంతటీ ప్రేమ నీదీ - ఇంతగా కోరుకుందీ 

మరువనూ యేసయ్య 

 

నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా 

నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా 

 

1. తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే

ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే 

నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా 

ఏ దారి కానరాక - నీ కొరకు వేచివున్నా 


ఎడబాటులేని గమనాన - నిను చేరుకున్న సమయాన 

నను ఆదరించే ఘన ప్రేమ - అపురూపమైన తొలిప్రేమ 

ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా 

ఎవ్వరూ లేరుగా - యేసయ్య నీవెగా


2. ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా 

విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం 

నీ సన్నిథానమందు - సీయోను మార్గమందు 

నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ 


నీ తోటి సాగు పయనాన - నను వీడలేదు క్షణమైన 

నీ స్వరము చాలు ఉదయాన - నిను వెంబడించు తరుణాన 

శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో 

నిత్యము తోడుగా నిలిచె నా యేసయ్య




YEVARU CHOOPINCHALENI - ఎవరు చూపించలేనీ Watch Video



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.