Vedanalo Unnanaya - వేదనలో ఉన్నానయా నన్నాదరించుము Lyrics - Sireesha Bhagavathula
| Singer | Sireesha Bhagavathula |
| Composer | Rev. Samson Veruva |
| Music | Mani Zenna |
| Song Writer | Rev. Samson Veruva |
Lyrics
వేదనలో ఉన్నానయా నన్నాదరించుము నా యేసయ్యా
ఒంటరినై ఉన్నానయా నా దరి చేరుము నా యేసయ్యా
విడిపించుము నా ప్రభువా
మనుష్యుల స్వార్ధము తెలియక నేను బలియయ్యాను వెలియయ్యాను
స్వార్ధములేని ప్రేమను చూపే
నీవలనే బ్రతికి ఉన్నానయా
సాక్షిగ నే బ్రతికి ఉంటానయా
నన్ను కాపాడుము నా దేవా
విడిపించుము నా ప్రభువా
మనసులో భారము తీరక నేను
అలసియున్నాను సొలసియున్నాను
మలినము లేని మమతను చూపే
నీవలనే బ్రతికియున్నానయా
సాక్షిగ నే ఇలలో ఉంటానయా
నన్ను కాపాడుము నా దేవా
విడిపించుము నా ప్రభువా
