Neevu Lenide Ne Lenu Yesayya Lyrics - G Esther Rani
| Singer | G Esther Rani |
| Composer | |
| Music | Moses Danny |
| Song Writer |
Lyrics
నీవు లేనిదే నే లేను యేసయ్య నీవే
నా జీవము నీ కృప లేకపోతే నే బ్రతుకలేను నీ ప్రేమే శాశ్వతం(2)
అద్వితీయుడా ఆరాధ్య దేవుడా (2)
నీవే నాకు ఆశ్రయ దుర్గము నీవే నాకు రక్షణ శృంగము. "నీవు లేనిదే"
1. గర్భములో ఉన్నది మొదలు కాపాడింది నీ ప్రేమ
పిండము గా రూపింపక మునుపే ఎన్నుకున్నది నీ ప్రేమ (2)
నీ ప్రేమ లేక పోతే ఏమైపోదునో ఏసయ్య
నీ కృప లేకపోతే నా బ్రతుకు శూన్యం యేసయ్య....(2)
2. దీన స్థితిలో ఉన్న నన్ను హెచ్చించింది నీ ప్రేమ
వాగ్దానము నే వరముగ ఇచ్చి ఆదరించిన నీ ప్రేమ (2)
కన్నీటిని తుడిచి కౌగిట చేర్చి కనికరించిన నీ ప్రేమ
నే జీవించుచున్నానంటే దానికి కారణం నీ ప్రేమ.....(2)
కారణం నీ ప్రేమ. "నీవు లేనిదే"
