Type Here to Get Search Results !

మిత్రుడా రారమ్ము మైత్రితో పార మార్థికమైన మాటల్ వచింతు మన్ననతో విను

మిత్రుడా రారమ్ము  మైత్రితో పార  మార్థికమైన  మాటల్ వచింతు  మన్ననతో విను Lyrics - mano


మిత్రుడా రారమ్ము - మైత్రితో పార - మార్థికమైన - మాటల్ వచింతు - మన్ననతో విను
Singer mano
Composer Shri. Devadas Mungamuri
Music Jonah Samuel
Song WriterShri. Devadas Mungamuri

Lyrics

మిత్రుడా రారమ్ము - మైత్రితో పార - మార్థికమైన - మాటల్ వచింతు - మన్ననతో విను



పూర్వ జన్మము నందు - పూర్తిగా పాపిని

అందుకె ఈ బాధ - పొందుచునున్నాను

అని యిట్లు మనస్సులో - అనుకొననే వద్దు

అది నిజమే యైన - అది కూడ పోగొట్టు

రక్షకుడున్నాడు - తత్క్షణమె రమ్ము ఆయన మానవుడై

నట్టి దేవుండు ఈ మాట నమ్మిన - ఎంత ధన్యుండవు

మనస్సులో ముద్రించు - కొని శాంతి పొందుము


ఈ జన్మమున గూడ - ఎన్నెన్నో పాపాలు

చేసియున్నందున - చివరకు నరకంబె

అని ఆత్మయందున - ఆలోచనెందుకు

అవి సిల్వపై యేసు - అంతరింప జేసె

ఆ వృత్తాంతంబును - ఆనందమున నమ్మి

సుఖముగ నుండుము సూక్ష్మ మార్గంబిది

ఎందరెన్నియన్న ఏ మాటల్ వినవద్దు



దేవ వాక్కె నిజము - దిక్కులు చూడకు

దివ్య దేవుడు నిన్ను - దీవించును గాక

భూమి చేసిన వాడు - పోషించును గాక

రక్షకుండౌ క్రీస్తు - రక్షించును గాక

పరమ వైద్యుడు స్వస్థ - పరచు చుండును గాక

పనులన్నిని సఫల - పరచు చుండును గాక

దైవాత్మ ధైర్యంబు - తెచ్చు చుండును గాక

అంతాన మోక్షంబు - అందజేయును గాక

విజయము ఈ పాట - విను వారి కామెన్




మిత్రుడా రారమ్ము - మైత్రితో పార - మార్థికమైన - మాటల్ వచింతు - మన్ననతో విను Watch Video



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.